రేషన్‌ కార్డుల దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన పౌరసరఫరాల శాఖ

71చూసినవారు
రేషన్‌ కార్డుల దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన పౌరసరఫరాల శాఖ
‘మీ సేవ' ద్వారా కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పందించింది. రేషన్‌ కార్డుల దరఖాస్తులు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే 'మీ సేవ'ను కోరినట్లు వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్