TG: నాగర్‌కర్నూల్ జిల్లా సలేశ్వరంలో జరుగుతున్న లింగమయ్య స్వామి జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో జాతరలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. కొందరు స్పృహ తప్పి కింద పడిపోయారు. భక్తులను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని.. వ్యాపారుల దందా విచ్చలవిడిగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.