బాత్‌రూంలో బిర్యానీ ప‌దార్థాలు క్లీనింగ్‌

71చూసినవారు
తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌లో అత్యంత అసహ్యకరమైన, జుగుప్సాకరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తినుబండారాలను వారు వండిన తీరుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ రెస్టారెంట్ కు చెందిన టాయ్‌లెట్‌లో తినుబండారాలను కడగడం చూసిన కస్టమర్లు అవాక్కయ్యారు. మహ్మద్ జాఫర్ ఖాన్ అనే గుర్తింపు పొందిన చెఫ్ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. ఆహారాన్ని బాత్‌రూంలో కడుగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్