హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం ఇవాళ జరగనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.