బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం ఆమోదం

63చూసినవారు
బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం ఆమోదం
సంక్రాంతి కానుకగా పెండింగ్‌ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నస్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం ఈ బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్