AP: మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారికి భారీగా 'వర్క్‌ఫ్రమ్‌హోమ్'ని ప్లాన్ చేస్తున్నట్లు చంద్రబాబు కీలక ట్వీట్ చేశారు. ''ముఖ్యంగా మహిళల కోసం ప్రభుత్వం 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం అమలుకు ప్లాన్ చేస్తోంది. ముందుగా.. అంతర్జాతీయ మహిళలు, బాలికల సైన్స్ దినోత్సవం సందర్భంగా.. మహిళలు, బాలికలందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ రంగాల్లో వారికి సమాన, సంపూర్ణ వృద్ధి అవకాశాలు లభించేలా చెయ్యడానికి మనం కమిటెడ్‌గా ఉన్నాం'' అని సీఎం ట్వీట్‌లో తెలిపారు.