ఈ నెల 14న గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇంకా సీఎం అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక న్యాయం, సమానత్వంపై ప్రసంగించనున్నారు.