వంతెన కూలిన ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్ (VIDEO)

68చూసినవారు
మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనపై CM దేవంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ విషాధ ఘటన గురించి తెలిసి తాను బాధపడ్డట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'డివిజనల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, CP, తహశీల్దార్‌తో నిరంతరం సంప్రదిస్తున్నాను. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్