ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక ఆదేశాలు

51చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్‌లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి, ధృవీకరించాలన్నారు. ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తేలితే, ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలి. దందాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్