తెలంగాణ అసెంబ్లీలో SC వర్గీకరణ అమలు తీర్మానాన్ని సీఎం రేవంత్ ప్రవేశపెట్టారు. SC వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 'SC వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తాం. సుప్రీం కోర్టు తీర్పు కోసం ఏకసభ కమిషన్ వేశాం. వర్గీకరణ అమలు చేయాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. SC వర్గీకరణలో క్రిమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ ప్రతిపాదించింది' అని వ్యాఖ్యానించారు.