HYD-గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌కు వికలాంగుల హక్కుల పోరాట సమితి పాలభిషేకం చేసింది. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వికలాంగులను, వికలాంగులు వివాహం చేసుకుంటే రూ.లక్షఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తు రేవంత్ రెడ్డి ఫొటోకు వికలాంగులు పాలభిషేకం చేశారు.