TG: రాష్ట్రంలో ఎస్టీల కోసం 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎస్టీలకు మరో తీపికబురు అందించారు. ఎస్టీల కోసం అదనపు ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని సీతక్క తెలిపారు. మైదాన ప్రాంతాల్లో సైతం ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత గిరిజనులకు అభివృద్ధికి ఫలాలు అందేలా చేస్తామని సీతక్క అన్నారు. దీంతో ఎస్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.