హైదరాబాద్‌పై సీఎం రేవంత్ పగబట్టారని BRS MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మూసీ, హైడ్రా పేరిట ఇప్పటికే హైదరాబాద్‌లో సీఎం సమస్యలు సృష్టించారని.. ఇప్పుడు మెట్రో రైలు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రతి మెట్రో ప్రయాణీకుడిపై నెలకు రూ.600 పైనే కనీస భారం పడుతుందన్నారు. తక్షణమే మెట్రో ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ను తిరోగమనం వైవు తీసుకెళ్లే ఏ నిర్ణయం మంచిది కాదని చెప్పారు.