TG: ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. తెలంగాణ కులగణన సర్వే గందరగోళం లో పడిందన్నారు. సర్వేలో జనాభా ఎందుకు తగ్గింది అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. కులగణన సర్వేతో బీసీలకు న్యాయం జరగదు అన్నారు. శుక్రవారం కులగణన ప్రజేంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ మోదీపై చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.