మాజీ ఎంపీ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

81చూసినవారు
మాజీ ఎంపీ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాథోడ్ తనదైన ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు రమేష్‌ రాథోడ్‌ మృతి పట్ల కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ సంతాపం తెలిపారు.