అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన CM రేవంత్

75చూసినవారు
అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన CM రేవంత్
హీరో అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అరెస్టును ఖండించారని ఓ న్యూస్ యాంకర్ అడగగా సీఎం స్పందించారు. 'వారికి వివరాలు అన్నీ తెలియవు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు. ఆయన సెక్యూరిటీ వల్లే తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. 10 రోజులైనా బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసింది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్