తెలంగాణ పెట్టుబడులను ఆహ్వానించేందుకు CM రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్ లోని నారిటా ఎయిర్‌పోర్ట్‌కు CM బృందం చేరుకుంది. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో–2025లో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం ప్రారంభిస్తారు. 17న సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ కార్పొరేషన్, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ తదితర సంస్థలతో సమావేశం కానున్నారు.