నాగోబా జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

60చూసినవారు
నాగోబా జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో రేపటి నుంచి నాగోబా జాతర ప్రారంభంకానుంది. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర నాగోబా అని అన్నారు. నాగోబా జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్