TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని, తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్తే రేవంత్ రెడ్డిని దొంగలా చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు శత్రువంటూ పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ విమర్శించారు.