TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువంటూ తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంత్రి పదవులు కోరేవాళ్లే నష్టమంటూ పేర్కొన్నారు. గురువారం నుంచి ఎమ్మెల్యేలు ప్రతిగ్రామం పర్యటించాలని సూచించారు.