TG: క్యాన్సర్ బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిరిసిల్లకు చెందిన సాయిచరణ్ అనే వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తన చికిత్స కోసం డబ్బులు సరిపోకపోవడం లేదని సాయిచరణ్ సీఎం రేవంత్ కి విన్నవించుకున్నారు. అయితే గతంలో సాయి చరణ్ చికిత్స కోసం CMRF ద్వారా రూ.5 లక్షలు అందజేయగా.. తాజాగా CMRF ద్వారా రేవంత్ స్వయంగా మరో రూ.7 లక్షలను అందించారు. దీంతో సాయి చరణ్ కుటుంబ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.