నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

64చూసినవారు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి హస్తినకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో రేవంత్ భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా సీఎం చర్చించవచ్చని సమాచారం.

సంబంధిత పోస్ట్