నారాయణపేట జిల్లాలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

55చూసినవారు
నారాయణపేట జిల్లాలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో సీఎం పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఇక్కడి నుండే ప్రారంభించనున్నారు. కాగా , మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకున్నామని ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్