TG: ఆదివాసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. తమ సమస్యల్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. 'ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను మంజూరు చేస్తున్నాం. బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తాం. కేస్లాపూర్ జాతరకు నిధుల మంజూరు చేస్తాం. ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం. ఉచితంగా బోర్లు వేస్తాం' అని CM హామీ ఇచ్చారు.