NDSA సిఫార్సులపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

54చూసినవారు
NDSA సిఫార్సులపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
TG: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చిన మధ్యంతర నివేదిక అమలు, కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలు, సుప్రీంకోర్టులో కేసు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు, ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలపై సీఎం సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్