సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండి పలువురు నేతలతో సమావేశమవనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జలశక్తి మంత్రిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.