సరస్వతి పుష్కరాలు తొలిరోజు కావడంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం రేవంత్‌కు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ తదితరులు ఘన స్వాగతం పలికారు. పుష్కర సమయంలో ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సా.6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహించనున్నారు.