తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేపు (గురువారం) సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా చేసి వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ భేటీకి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. కాగా ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.