TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురి శాఖల మార్పులపై వారితో చర్చించనున్నారు. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కనివారికి న్యాయం చేయడంపై చర్చించే అవకాశముంది. దీంతో పాటు రాష్ట్ర రాజకీయాలు, పథకాల అమలు తీరును వివరించనున్నట్లు తెలుస్తోంది.