హైదరాబాద్‌లో పేదల పెద్ద దవాఖానా నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. రూ.2,150 కోట్లతో అత్యాధునిక హంగులతో ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 26 ఎకరాల్లో విశాలమైన ఆస్పత్రి నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు.