TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూర్ లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 'ఎక్స్పీరియం పార్కు'ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్ దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.