ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఇప్పటికీ స్పందించలేదని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. 'నారాయణపేట జిల్లా డీఈవో బదిలీ వెనుక మర్మం ఏమిటి? కోదండరాం, ఆకునూరు మురళి ఎందుకు స్పందించడం లేదు?' అని ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం బాధ్యతారహితంగా మాట్లాడారు. హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయని గతంలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా ఆవేదన వ్యక్తం చేశారు' అని చెప్పారు.