హీరో శివన్నను పరామర్శించిన సీఎం

78చూసినవారు
హీరో శివన్నను పరామర్శించిన సీఎం
కన్నడ హీరో శివ రాజ్‌‌కుమార్ అమెరికాలో క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీ చేయించుకుని విజయవంతంగా కోలుకున్నారు. తాజాగా ఆయన ఇండియాకు తిరిగి రాగా, అభిమానులు విమానాశ్రయం వద్ద శివన్నకు ఘన స్వాగతం పలికారు. అయితే శివన్న ఇంటికి వచ్చిన రెండవ రోజు అంటే ఈరోజు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆయనను స్వయంగా పరామర్శించారు. ఆయన పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్