ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు

84చూసినవారు
ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు
ఏపీ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. వైసీపీ హయాంలో రూ.11.68 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌‌లో ఉన్నాయని, తద్వారా 224 మంది క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని రవినాయుడు ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో 180 మంది క్రీడాకారులకు రూ.7.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్