కాఫీ కాలేయానికి మేలు చేస్తుంది: అధ్యయనాలు

65చూసినవారు
కాఫీ కాలేయానికి మేలు చేస్తుంది: అధ్యయనాలు
కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర రసాయన మిశ్రమాలు కాలేయంలో వాపు ప్రక్రియ తగ్గటంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగేవారికి కాలేయంలో కొవ్వు పోగుపడటం ద్వారా తలెత్తే ఎంఏఎస్‌ఎల్‌డీ ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాలేయం సరిగా పనిచేయటానికి తోడ్పడుతుంది. ఇన్సులిన్‌కు కణాలు బాగా స్పందించేలా చూడటం, రక్తంలో గ్లూకోజు తగ్గేలా చేయటం దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్