తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. చలికితోడు పొగమంచి కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ 6.7 డిగ్రీలు, పటాన్‌చెరులో 9.6 డిగ్రీలు, రామగుండంలో10.6 డిగ్రీలు, మెదక్‌లో11.3 డిగ్రీలు, వరంగల్‌లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.