యూపీలోని బులంద్‌షహర్ జిల్లా అనుప్‌షహర్‌లోని పురాతన మా చాముండా ఆలయ ప్రాంగణంలో వందన్ యోజన కింద సుందరీకరణ కోసం చేపట్టిన నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. అధిక తవ్వకాల వల్ల భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం కూలిపోయింది. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అధికారులు ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శిథిలాల నుండి శివలింగాన్ని తీసి ఆలయ ప్రాంగణంలో సురక్షితంగా ఉంచారు.