మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పడింది. 2023, సెప్టెంబరులో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2024, మార్చిలో కమిటీ తన నివేదికను సమర్పించింది. 'ఒక దేశం ఒక ఎన్నిక విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని, మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, రెండో దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను ఇటీవల కేంద్రం ఆమోదించింది.