వీధి కుక్కల నియంత్రణకు వారంలో కమిటీ వేయాలి: హైకోర్టు

51చూసినవారు
వీధి కుక్కల నియంత్రణకు వారంలో కమిటీ వేయాలి: హైకోర్టు
తెలంగాణలో రోడ్లపై స్వైర విహారం చేస్తున్న కుక్కల నియంత్రణకు వారంలో కమిటీని వేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయాడని దాఖలైన పిటీషనుపై కోర్టు విచారించింది. ఈ అంశంపై ఉదాసీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్