TG: ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ నష్ట పరిహారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 'వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది. దెబ్బతిన్న పంట వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించాం. వర్షాల వల్ల ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండేలా తమ ప్రభుత్వం చూసుకుంటుంది' అని స్పష్టం చేశారు.