BRS నేత, హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్‌టౌన్ PSలో ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన తీరుపై కంప్లైంట్ చేశారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చి, మిస్ బిహేవ్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, కౌశిక్ రెడ్డి, MLA సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.