TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకట్ పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు కాపీ అందించారు. కాగా బుధవారం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిటీ విచారణ సందర్భంగా కేటీఆర్, కౌశిక్‌రెడ్డి సీఎంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.