TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై శాసనమండలి చైర్మన్‌కు రెడ్డి ఐక్య సంఘం ఫిర్యాదు చేసింది. రెడ్లను కించపరిచే విధంగా దూషించిన తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్ క్వాలిఫై చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.