తమ కులాన్ని దూషించారని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం డీజీపీ జితేందర్‌కి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28న వరంగల్ వేదికగా జరిగిన బీసీ సభలో మల్లన్న రెడ్డి కులం వారిని కుక్కలతో పోలుస్తూ దూషించారని తెలిపారు. ఇందుకు మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.