ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్వర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కన్వరీయాలు కాన్వాయ్ ని ఒక కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీనితో కోపంతో ఉన్న కన్వర్యాలు కారును చుట్టుముట్టి అందులోని మహిళలు, పిల్లలపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన మంగళౌర్ కోతవాలి పరిధిలో చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.