తెలంగాణలో కాంగ్రెస్, BJP చీకటి స్నేహం చేస్తోందని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చితే బీజేపీ నేతలకు నొప్పిలేస్తుందని.. కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే BJP నేతలు స్పందించారని చెప్పారు. ఏపీ జలదోపిడీ విషయంలో BJP నేతలు, కాంగ్రెస్ నేతలు నోరెత్తడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టులలో జరుగుతున్న నష్టాల మీద కేంద్రం స్పందించట్లేదన్నారు.