రేపు నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

83చూసినవారు
రేపు నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
TG: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్‌కి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు, అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్