అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. రెండేళ్లు అవుతున్నా ఏం అభివృద్ధి చేయకుండా BRSపై బురదజల్లుతున్నారని ఆగ్రహించారు. ఇప్పటికే గత ప్రభుత్వంపై 10కి పైగా ఎంక్వరీలు వేశారని.. ఎక్కడా ఏం రుజువు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ ధరణి ఫోరెన్సిక్ అడిట్ అని మళ్ళీ ఇంకో ఎంక్వైరీ వేస్తారట అంటూ ఎద్దేవా చేశారు.