కుల గుణనలో బీసీలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తే పోరాడుతామని బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు. ‘రాష్ట్రంలో చేపట్టిన గణన సర్వే అంతా తప్పుల తడకగా ఉంది. గతంలో ఆరు శాతం ఉన్న ఓసీలు నేడు 15 శాతం పెరిగితే, 52 శాతం ఉన్న బీసీలు నేడు 46 శాతానికి ఎలా తగ్గుతారు. బీసీ కులాలతోపాటు ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గడం రాజకీయ కుట్ర. సర్వేను తిరిగి శాస్త్రీయంగా, సమగ్రంగా చేపట్టాలి’ అని డిమాండ్ చేస్తున్నారు.