ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌పై పాకిస్తాన్ దాడుల సమయంలో పోరాడిన జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా 'జైహింద్ ర్యాలీ' చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 'జైహింద్ ర్యాలీ' చేపడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని ర్యాలీ ద్వారా ప్రశ్నిస్తామన్నారు.